కేంద్రం ఇప్పటికి నిద్రమత్తు వీడింది. గత యేడాది కరోనా వైరస్ నేర్పిన గుణపాఠాలను పెద్దగా పట్టించుకోలేదు. కానీ, రెండో దశ కరోనా వైరస్ వ్యాప్తిలో కేంద్రం ఏ విధంగా నడుచుకుందే తేటతెల్లమైపోయింది. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ సంక్షోభం నెలకొన్నది.
ఈ ప్లాంట్లను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని జిల్లా ప్రధాన కార్యాలయాల్లో ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్లాంట్ల ఏర్పాటు జరుగుతుందని పీఎంఓ పేర్కొంది.