ఇకపోతే, పిల్లలకు కరోనా టీకాపై భారత్ బయోటెక్ చేపట్టిన క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు సెప్టెంబర్ నాటికి వస్తాయని భావిస్తున్నట్లు తెలిపారు. చిన్నారులపై ఇప్పటికే ప్రయోగాలు జరుగుతున్నాయన్నారు. 2 నుంచి 12 ఏళ్ల లోపు వయస్సు వారి కోసం భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేస్తున్న కొవాగ్జిన్ టీకా.. రెండో, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయని వివరించారు.