సముద్రంలో నిర్మించిన వివేకానంద స్మారక రాక్, తిరువళ్ళూర భారీ విగ్రహాలను చూసేందుకు బోటులో సముద్రంలోకి వెళుతుంటారు. మంగళవారం కన్యాకుమారికి భారీసంఖ్యలో పర్యాటకులు వచ్చినా, ఐదు రోజులుగా కొనసాగుతున్న కడలి కల్లోలం కారణంగా పడవ షికారు రద్దు చేశారు. దీంతో పలువురు అక్కడి నుంచి నిరుత్సాహంగా వెనుదిరిగారు.
ఇదిలావుండగా, ప్రస్తుతం కోస్తాంధ్ర, దాని చుట్టుపక్కల ప్రాంతాలపై సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం, ఈశాన్య బంగాళాఖాతం, దానిచుట్టుపక్కల ప్రాంతాల్లో సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడివుందని వాతావరణ శాఖ వెల్లడించింది.