అండర్ వరల్డ్ డాన్, మాఫియా కింగ్ దావూద్ ఇబ్రహీం పూర్వీకులకు సంబంధించిన ఆస్తులు వేలం వేయనున్నారు. అంటే, దావూద్ తాత, అవ్వలకు సంబంధించిన స్థిరాస్తుల వేలం వచ్చే నెల పదో తేదీన వేలం వేయనున్నారు.
ఈ ఆస్తుల వేలం కోనం ఈ-వేలం, బహిరంగ వేలం, సీలు చేసిన టెండర్ల విధానాలను పాటిస్తామని సంబంధిత అధికారులు వెల్లడించారు. దేశం నుంచి పారిపోయిన దావూద్ పాకిస్థాన్‌లోని కరాచీలో ఉన్నట్లు నిఘా వర్గాల సమాచారం.