దేశంలోనే తొలిసారి నదీగర్భంలో మెట్రో రైలు.. నేడు ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభం

ఠాగూర్

బుధవారం, 6 మార్చి 2024 (10:28 IST)
దేశంలోనే తొలిసారిగా నదీగర్భంలో మెట్రో రైల్ మార్గం నిర్మించగా, ఈ మార్గంలో నడిచే మెట్రో రైలును ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతాలో తొలి అండర్వటర్ మెట్రో ట్నెల్‌ను బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. కోల్‌కతా ఈస్ట్, కోల్‌కతా వెస్ట్  మెట్రో కారిడార్ కింద హుగ్లీ నది దిగువన మొత్తం 16.6 కిలోమీటర్ల మేరకు ఈ సొరంగ మార్గాన్ని నిర్మించారు. దాదాపు రూ.120 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ అండర్వాటర్ మెట్రో టన్నెల్ హౌరా మైదాన్ నుంచి ఎస్ఏనాడె స్టేషన్ మధ్యలో ఉంది. 520 మీటర్ల పొడవు ఉన్న ఈ టన్నెల్ను 45 సెకన్లలో దాటే మెట్రో రైలు కోలకతాకు వెళ్లే ప్రయాణికులకు కొత్త సరికొత్త అనుభూతిని అందించనుంది.
 
సొరంగం అంతర్గత వ్యాసం 5.5 మీటర్లు. బాహ్య వ్యాసం 6.1 మీటర్లు. ఈ సొరంగ మార్గాన్ని నదీగర్భానికి 16 మీటర్ల దిగువన, భూమిలోపలికి 32 మీటర్ల లోతులో నిర్మించారు. కోల్కతా ఈస్ట్, వెస్ట్ కారిడార్‌కు ఈ టన్నెల్ నిర్మాణం అత్యంత కీలకమని అధికారులు తెలిపారు. అయితే ప్రస్తుతం హౌరా నుంచి సీల్దాకు రోడ్డు మార్గంలో వెళ్లాలంటే గరిష్ఠంగా 90 నిమిషాల సమయం పడుతుంది. ఇక ఈ అండర్ వాటర్ మెట్రో మార్గం ఏర్పాటుతో ప్రయాణ సమయం 40 నిమిషాలకు తగ్గనుంది. ఈ కారిడార్ల పరిధిలో ఎస్లనాడే, మహాకారణ్, హావ్ డా, హావ్ డా మైదాన్ వంటి ముఖ్యమైన స్టేషన్ లు ఉన్నాయి.
 
కొన్నిసార్లు అనేక సాంకేతిక కారణాల వల్ల మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడుతుంటుంది. అలాంటి అత్యవసర సమయాల్లో మెట్రో ప్రయాణికులు ఎలాంటి భయాలకు లోనవ్వకుండా పక్కనే నిర్మించిన నడక మార్గాన్ని కూడా వినియోగించుకోవచ్చని ఈ ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. ఇలాంటి సాంకేతిక సమస్యల నుంచి సులువుగా బయటపడేలా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని కోల్కతా మెట్రో జనరల్ మేనేజర్ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. 'ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అహర్నిశలు కష్టపడ్డాం. రాత్రి 12 గంటల వరకు పనిచేసేవాళ్లం. తద్వారా యాత్రికులకు లేదా ప్రయాణికులకు నదీ గర్భంలో ప్రయాణిస్తున్నామనే అనుభూతిని కలిగించేలా ప్రయత్నం చేశాం. అంతకుముందు పెయింటింగ్స్ ద్వారా ఈ మెట్రో ప్రాజెక్ట్ ప్రాముఖ్యతను అందరికీ తెలియజేశాం. ఇంజనీరింగులో ఈ అండర్ వాటర్ మెట్రో నిర్మాణాన్ని ఒక మార్వెల్‌గా చెప్పవచ్చు. ప్రతిరోజు కనీసం 7 లక్షల మంది ప్రయాణికులు అండర్ వాటర్ మెట్రోలో ప్రయాణిస్తారని అంచనా వేస్తున్నాం అని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు