దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితులు ఎన్ కౌంటర్‌లో చచ్చారు. ఈ క్రమంలో ఢిల్లీ నిర్భయ కేసులో దోషులను ఇన్ని రోజుల పాటు జైల్లో జీవిస్తూ వుండటంపై దేశంలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. దీనితో వారిని ఉరి తీయడం ఖాయమైందనే వార్తలు వస్తున్నాయి. డిసెంబరు 16వ తేదీన నిర్భయ దోషులను ఉరి తీస్తారంటూ ప్రచారం జరుగుతోంది.
ఈ నేపధ్యంలో నిర్భయ దోషుల్లో ఒకడు సుప్రీంకోర్టుకు ఓ పిటీషన్ పెట్టుకున్నాడు. ఢిల్లీలోని గాలి పీలిస్తేనే చనిపోవడం ఖాయమనీ, ఢిల్లీ వాయు కాలుష్యానికి తమ ఆయుష్షు తగ్గిపోతుంది కనుక తమను ఉరి తీసే బదులు ఢిల్లీలో వదిలేస్తే ఆ గాలి పీల్చే చచ్చిపోతామనీ, కనుక తమను ఉరి తీయకుండా వదిలేయాలంటూ అతడు సుప్రీంకోర్టును వేడుకున్నాడు. నిర్భయ దోషుల్లో ఒకడైన అక్షయ్ కుమార్ ఈమేరకు పిటీషన్ పెట్టుకున్నాడు.