కడప జిల్లాలోని రాంనగర్ కాలనీ అది. గౌరి, అనంత్‌లకు రెండు నెలల క్రితమే వివాహమైంది. అనంత్ స్థానికంగా ప్లంబర్‌గా పనిచేసేవాడు. గౌరి ఇంటి దగ్గరే ఉండేది. అనంత్‌కు సొంత ఇల్లు ఉంది. దీంతో తనకు వచ్చే డబ్బులతో ఇద్దరూ ప్రశాంతంగానే ఉండేవారు.
క్రిష్ణకు అప్పటికే కారు ఉంది. రియల్ ఎస్టేట్‌లో బాగానే సంపాదించాడు. తన స్నేహితుడికి చెందిన 50 ఎకరాల భూమి కడప నగరం చుట్టుప్రక్కల ఉండటం, అందులో 25 ఎకరాలను అమ్మాలని స్నేహితుడు నిర్ణయించుకోవడంతో వాటిని విక్రయించేందుకు క్రిష్ణ అక్కడకు వచ్చాడు.
నాలుగు, ఐదు నెలలు మాత్రమే తాను ఇక్కడ ఉంటానని అనంత్‌కు చెప్పి ఇంటి అడ్వాన్స్ ఇచ్చి అక్కడికి వచ్చి చేరిపోయాడు. క్రిష్ణ డ్రెస్, స్టైల్, కారు, హుందాతనం చూసిన గౌరి అతని మోజులో పడిపోయింది. ప్లంబర్‌గా పని చేస్తున్న భర్త తెచ్చే డబ్బులు ఇంటి ఖర్చులకు మాత్రమే సరిపోతుండటం, కావాల్సిన వస్తువులు భర్త కొనివ్వకపోవడంతో క్రిష్ణతో పరిచయం పెంచుకుంది గౌరి.
ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్త పనికి వెళ్ళిందే తడవుగా మేడ మీదకు వెళ్ళి క్రిష్ణతో కలిసి తన సంబంధాన్ని సాగించేది. తనకు కావాల్సిన వాటిని క్రిష్ణ కొనిచ్చేవాడు. అయితే గౌరిలో మార్పు కనిపించడం.. ఇంట్లో కొత్తకొత్త సామానులు వస్తుండటంతో అనంత్‌కు అనుమానం వచ్చింది. తనపై భర్తకు అనుమానం వచ్చిందని తెలుసుకున్న గౌరి ఎలాగైనా అతడిని చంపేయాలని నిర్ణయించుకుంది. రెండు రోజుల క్రితం ప్రియుడు క్రిష్ణతో కలిసి నిద్రిస్తున్న అనంత్‌ను ఊపిరాడకుండా ముఖానికి దిండును అడ్డం పెట్టి చంపేసింది.