వివరాల్లోకి వెళితే, ఛావ్లా ప్రాంతంలో ఉంటున్న సతీశ్ సింగ్(37), భార్య కవిత(35).. ఆమె అత్తామామలు రాజా సింగ్(61), ఓంవతి(58)లను గొంతునులిమి.. ఆ తర్వాత కత్తితో పొడిచి హత్య చేసిందని పోలీసులు చెప్పారు. ఆ సమయంలో వాళ్ల పిల్లలకు కూడా ఇంట్లోనే ఉన్నారని తెలిపారు.
ఇద్దరి మృతదేహాలు బెడ్‌రూంలో దొరికాయని.. వాళ్ల ముఖాలపై కత్తిగాట్లు ఉన్నాయని వెల్లడించారు. ఆస్తి వివాదం కారణంగానే ఈ హత్య జరిగినట్లు ప్రాధమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. కవిత, సతీశ్ సింగ్‌లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.