కన్నబిడ్డ లేట్‌గా వచ్చిందని మందలించడం పోయి.. కత్తితో దాడి చేశాడో తండ్రి. ఢిల్లీకి చెందిన ఓ తండ్రి మాత్రం ఇంటికి లేట్‌గా వచ్చిన కూతురిపై ఏకంగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. సెప్టెంబర్ 9న ఢిల్లీకి చెందిన ఓ యువతి తన ఆంటీ వాళ్లింటికి వెళ్లి రాత్రి బాగా పొద్దుపోయాక ఇంటికి తిరిగొచ్చింది. దీంతో ఆగ్రహానికి గురైన తండ్రి కత్తితో దాడికి పాల్పడ్డాడు.
పదునైన కత్తితో ఆ యువతి గొంతు కోసేందుకు ప్రయత్నించాడు. కానీ కుదరకపోవడంతో ఆమెను చితకబాది ఓ గదిలో బంధించాడు. కత్తి గాయాలతో ఐదు రోజులపాటు బందీగానే ఉన్న ఆ యువతి ఎలాగోలా తప్పించుకొని సెంట్రల్ ఢిల్లీలో ఉన్న నానమ్మ ఇంటికి చేరుకుంది. ఆపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న ఆ తండ్రి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.