మైలాపూర్ లజ్‌కార్నర్‌లో ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంలు ధ్వంసమైవుండడాన్ని ఆదివారం ఉదయం భద్రతా సిబ్బంది గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఏటీఎంల కేంద్రంలో సీసీకెమెరాలు పని చేయడం లేదని సమాచారం. ఏటీఎంలో నగదు రాకపోవడంతో ఆగ్రహించిన వినియోగదారులు ఈ విధ్వంసానికి పాల్పడి వుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.