మానసిక ఒత్తిడి తీవ్ర పరిణామాలకు దారితీస్తుందనేందుకు ఈ ఘటనే నిదర్శనం. డిప్రెషన్‌తో బాధపడే ఓ మహిళ తన 45 రోజుల పసికందును గొంతు కోసి చంపిన దారుణమైన సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. తల్లి నేహా మానసిక ఒత్తిడిలో వుందని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడి అయ్యింది. ఇంకా ఈ ఘటనకు సంబంధించి కచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.
తన బిడ్డను హత్య చేసింది తానేనని ఆ తల్లి నేరాన్ని అంగీకరించిందని, ఆమెపై బిఎన్‌ఎస్ సెక్షన్ 103 కింద కేసు నమోదు చేసినట్లు డిసిపి అగర్వాల్ తెలిపారు. "గురువారం ద్వారకాపురి ప్రాంతంలోని పార్ధి సెటిల్‌మెంట్‌లో ఇంటి లోపల తల్లి తన బిడ్డ (ప్రియాన్ష్) గొంతును పదునైన వస్తువుతో కోసిందని దర్యాప్తులో తేలింది.
నేహా మానసిక స్థితి అస్థిరంగా ఉందని, గతంలో ఆమె శిశువును గొంతు కోసి చంపడానికి ప్రయత్నించిందని నిందితుడి బంధువులు చెప్పారని డిసిపి అగర్వాల్ తెలిపారు. ఈ కేసు పట్ల దర్యాప్తు జరుగుతుంది. నిందితురాలు నేహా మానసిక ఆరోగ్య పరిస్థితులను పరిశీలిస్తున్నామని డిసిపి అగర్వాల్ అన్నారు.