డేరా బాబా ఆశ్రమంలోని టాయిలెట్లలో కూడా సీసీటీవీ కెమెరాలు

బుధవారం, 13 సెప్టెంబరు 2017 (10:37 IST)
సిర్సాలోని డేరా బాబా ఆశ్రమంలో ఉన్న టాయిలెట్లలో కూడా సీసీటీవీ కెమెరాలను అమర్చిన విషయం తాజాగా బహిర్గతమైంది. సాధ్వీల అత్యాచారం కేసులో 20 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్ రాంరహీం సింగ్‌కు చెందిన డేరా ఆశ్రమాన్ని ప్రతి అణువణువూ తనిఖీ చేస్తున్నారు. అలాగే, పలువురిని అరెస్టు చేస్తున్నారు. 
 
ఈ క్రమంలో తాజాగా డేరా సచ్చా సౌధాకు చెందిన ఐటీ విభాగం హెడ్ వినీత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఫరీదాబాద్ నివాసి అయిన ఈయనపై సిర్సాలోని మిల్క్‌ప్లాంట్, షాహ్‌పూర్‌లోని విద్యుత్ కేంద్రాలకు నిప్పుపెట్టడం, ప్రభుత్వ కార్యకలాపాలకు భంగం కలిగించడం, దేశద్రోహం తదితర ఆరోపణలతో పోలీసులు వినీత్‌ను అరెస్ట్ చేశారు. 
 
ఆ తర్వాత ఆయన వద్ద పోలీసులు జరిపిన విచారణలో అనేక విషయాలు వెల్లడయ్యాయి. డేరా పరిసర ప్రాంతాల్లో అనేక సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసివున్నట్టు తెలిపారు. వీటి నంచి 5 వేల సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలోని అత్యధిక కెమెరాలు బాబాకు చెందిన 91 ఎకారాల్లో నిర్మించిన అద్భుత మహల్, హోటల్, రిసార్ట్స్, సత్సంగ్ భవనంతో పాటు.. చివరకు పలు ప్రాంతాల్లోని మరుగుదొడ్లలో కూడా వీటిని ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి