ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)పై బహిరంగ చర్చకు న్యాయకమిషన్ విడుదలచేసిన ప్రశ్నావళి వివాదం రాజుకుంటోంది. దీన్ని అమలుచేస్తే దేశంలో అంతర్యుద్ధానికి దారి తీస్తుందని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్బీ), ఇతర ముస్లిం సంస్థలు హెచ్చరిస్తున్నాయి. అయినప్పటికీ.. ఈ అంశంపై తమ వైఖరి మార్చుకోబోమని కేంద్రం తెగేసి చెప్పింది. ఈ వ్యాఖ్యలపై ముస్లిం పెద్దలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.
రాజకీయాల్లోకి రావాలనుకుంటే మద్దతిచ్చే వారితో వెళ్లండని సూచించారు. అన్ని రంగాల్లో మహిళలకు సమాన హక్కులు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రధానిని వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకోవడం మంచిదికాదన్నారు. తలాక్ చెప్పే వ్యవస్థను రూపుమాపాల్సిన అవసరం ఉందన్నారు. మూడు సార్లు తలాక్ చెప్పే వ్యవస్థపై ప్రజల్లో తీవ్రంగా చర్చ జరగాలని చెప్పారు.