రాష్ట్రపతి ఎన్నికలు.. ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము విజయం

గురువారం, 21 జులై 2022 (21:05 IST)
రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసింది.  ఇందులో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము విజయం సాధించారు. కాగా, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హా ఓటమి చెందారు.
 
మొదటి రౌండ్‌ నుంచి ద్రౌపది ముర్ము ఆధిక్యంలో ఉండగా, యశ్వంత్‌ సిన్హా వెనుకంజలో ఉంటూ వచ్చారు. ఇక ముర్ము విజయం ఖాయమంటూ ఫలితాలు వెల్లడి కాకముందే ఒడిశా రాష్ట్రంలో సంబరాలు నెలకొన్నాయి. 
 
గిరిజన ప్రజలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. నృత్యాలు చేస్తూ స్వీట్లు తినిపించుకున్నారు. ద్రౌపది ముర్ము విజయం ఖాయమంటూ ముందుగానే ప్రకటించుకున్నారు. ఇప్పుడు ముర్ము విజయం సాధించడంతో సంబరాలు హోరెత్తిపోతున్నాయి.
 
రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము అఖండ విజయం సాధించడంతో హైదరాబాద్‌లోని నాంపల్లి బీజేపీ కార్యాలయంలో సంబరాలు ఆకాశాన్నంటాయి. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు