వ్యక్తులు ఆదాయ పన్ను శాఖ వెబ్‌సైట్‌ను సందర్శించి వారి ఆధార్ నెంబర్‌ను ఎంటర్ చేయగానే ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నెంబర్‌కు వన్ టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) వస్తుందని, దీని ద్వారా ఆధార్ వివరాల పరిశీలన జరుగుతుందని ఆయన చెప్పారు.
ఈ ప్రక్రియ ద్వారా పన్ను చెల్లింపుదారులు దరఖాస్తు ఫారాలను నింపి ఆదాయ పన్ను శాఖకు సమర్పించే ఇబ్బంది తప్పుతుందని, ఇదే సమయంలో పన్ను శాఖ అధికారులు పన్ను చెల్లింపుదారుల ఇంటికి పాన్ కార్డులను పంపించే ప్రక్రియ సులభం అవుతుందని ఆయన వివరించారు.
పాన్-ఆధార్ అనుసంధానానికి ఈ ఏడాది మార్చి 31 చివరి గడువు
ప్రతిపాదిత టాక్స్‌పేయర్ చార్టర్ గురించి పాండే మాట్లాడుతూ.. మొత్తం పన్ను చట్టాల్లో పన్ను చెల్లింపుదారుల బాధ్యత గురించి తెలియజేస్తాయని, అయితే పన్ను అడ్మినిస్ర్టేషన్ బాధ్యతల గురించి మాత్రం పేర్కొన్నలేదన్నారు.