మణిపూర్‌లో భూకంపం

బుధవారం, 7 అక్టోబరు 2020 (07:50 IST)
మణిపూర్‌లోని ఉక్రూల్‌ జిల్లాలో భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేలుపై తీవ్రత 4.3గా నమోదైంది. బుధవారం తెల్లవారుజామున 3.32 నిమిషాలకు ఈ భూకంపం సంభవించిందని, భూకంప కేంద్రం పదికిలోమీటర్ల లోతులో ఉందని అధికారులు తెలిపారు.

అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అన్నారు. గత నెల ఒకటిన కూడా ఉక్రూల్‌ నగరానికి 55 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించిందని, రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 5.1గా నమోదైందని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు