వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన పదిహేడు సంవత్సరాల ఓ బాలిక బెంగళూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మీడియట్ చదువుతోంది. ఫ్యాషన్ ఈవెంట్ మేనేజర్‌గా పని చేస్తున్న ప్రగదీశ్ కపూర్ (32) అనే వ్యక్తికి ‘ఫేస్ బుక్’ ద్వారా ఆ అమ్మాయి పరిచయమైంది. ఈ పరిచయం ద్వారా మోడలింగ్ అవకాశం కల్పిస్తానని ప్రగదీశ్ మాయమాటలు చెప్పి.. బాలికను లొంగదీసుకున్నాడు.