ఆస్పత్రిలో అడ్మిట్ అయిన మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్

ఠాగూర్

గురువారం, 14 మార్చి 2024 (11:13 IST)
మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ అనారోగ్యం పాలయ్యారు. దీంతో ఆమె ఆస్పత్రి పాలయ్యారు. ఆమెను పూణెలోని భారతి ఆస్పత్రిలో చేర్చారు. ఆమెకు జ్వరం, కొద్దిపాటి ఇన్ఫెక్షన్ ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు. ఈ మేరకు వైద్యులో ఓ ప్రకటన చేశారు. 
 
ప్రతిభా పాటిల్‌కు జ్వరంతో పాటు ఛాతిలో కొద్దిగా ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు. ఆమె ఆరోగ్యం నిలగడానే ఉందని, పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని చెప్పారు. ప్రతిభా పాటిల్ భారత దేశ తొలి మహిళా రాష్ట్రపతి అన్న విషయం తెల్సిందే. 2007-12లో ఆమె భారత రాష్ట్రపతిగా సేవలందించారు. 
 
ఉత్తరప్రదేశ్‌లో క్వీన్ స్వీప్ చేయనున్న బీజేపీ ... 80కి 77 చోట్ల గెలుపు  
 
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తిగా కాషాయమం చేయనుంది. ఈ రాష్ట్రంలో ఉన్న మొత్తం 80 లోక్‌సభ స్థానాలకు గాను ఏకంగా 77 సీట్లలో ఆ పార్టీ గెలుపొందుతుందని, ఇండియా కూటమికి కేవలం రెండు సీట్లు, బీఎస్పీకి ఒక సీటు మాత్రమే వస్తుందని న్యూస్ 18 మెగా ఒపీనియన్ పోల్ నిర్వహించిన సర్వేలో తేలింది. గత 2014లో యూపీలో బీజేపీ 72 స్థానాల్లో గెలుపొందగా, 2019లో 62 సీట్లను దక్కించుకుంది. అయితే, ఈ దఫా ఈ సీట్లు 77కు పెరుగుతాయని తెలిపారు. దీనికి కారణం అయోధ్యలో రామాలయం నిర్మాణం, ప్రారంభోత్సవమని పేర్కొంటున్నారు. 
 
న్యూస్18 మెగా ఒపీనియన్ పోల్ తాజాగా 9 రాష్ట్రాల్లోని సర్వే ఫలితాలను వెల్లడించింది. బీజేపీ దక్షిణాదిన గతంలో కంటే కాస్త పుంజుకున్నట్లుగా ఈ సర్వేలో వెల్లడైంది. బీజేపీ తమిళనాడులో 5 సీట్లు, కేరళలో 2 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని ఈ సర్వే పేర్కొంది. 543 లోక్ సభ స్థానాలకుగాను 242 స్థానాలకు సర్వే ఫలితాలను వెల్లడించింది. వీటిలో ఎన్డీయే కూటమి 174 సీట్లు, ఇండియా కూటమి 67 సీట్లు, ఇతరులు 7 సీట్లు గెలుచుకోవచ్చునని విశ్లేషించింది.
 
తొమ్మిది రాష్ట్రాల్లో ఎవరికి ఎన్ని సీట్లు రావొచ్చువంటే...?
1. బీహార్ (40) - ఎన్డీయే 38, ఇండియా 2
2. కేరళ (20) - యూడీఎఫ్ 14, ఎల్డీఎఫ్ 4, బీజేపీ 2
3. మధ్యప్రదేశ్ (29) - బీజేపీ 28, ఇండియా 1
4. తమిళనాడు (39) - ఇండియా 30, బీజేపీ 5, అన్నాడీఎంకే 4
5. హర్యానా (10) - బీజేపీ 10, ఇండియా O
6. హిమాచల్ ప్రదేశ్ (4) - బీజేపీ 4, ఇండియా 0
7. పంజాబ్ (13) - ఆప్ 1, ఇండియా 7, బీజేపీ 3, ఇతరులు 2
8. ఢిల్లీ (7) - బీజేపీ 7, ఇండియా 0
9. ఉత్తర ప్రదేశ్ (80) - బీజేపీ 77, ఇండియా 2, ఇతరులు 1

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు