దీని ప్రకారం రాష్ట్రాలు ఇక తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. చివరి సెమిస్టర్ విద్యార్థులకు సెప్టెంబరు పూర్తయ్యేలోపు విశ్వవిద్యాలయాలు పరీక్షలు నిర్వహించాలి. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ పద్ధతుల్లో లేదా రెండింటి కలయికగా పరీక్షలు జరుపుకోవచ్చు.
బ్యాక్‌లాగ్ సబ్జెక్టులు ఉంటే పరీక్షలు నిర్వహించాలి. వాటిని కూడా పైవిధానంలో జరపాలి. ఒకవేళ సెప్టెంబరులో పరీక్షలకు, ఏదైనా ఒక సబ్జెక్టు పరీక్షకు హాజరుకాలేని విద్యార్థులకు మరోసారి ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించాలి. ఇది 2019-20 విద్యార్థులకు ఈ ఒక్కసారి మాత్రమే అవకాశం ఇవ్వాలి.