వారణాసిలో భద్రత మరింత పెరగనుంది. నిత్యం లక్షలాది మంది భక్తులు సందర్శిస్తున్న వారాణాసి నగరంలో స్మార్ట్ నిఘా వ్యవస్థ ఏర్పాటుతో నేరగాళ్ల సంచారంపై నిఘా పెరగనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సొంత నియోజకవర్గ కేంద్రమైన ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీలో 3వేల సీసీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు.
అధునాతన భారతీయ, యూరోపియన్, అమెరికన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ముఖ గుర్తింపు కెమెరాలను ఏర్పాటు చేసినట్లు వారణాసి స్మార్ట్ సిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్ గౌరంగ్ తెలిపారు.
ముఖ గుర్తింపు కెమెరాలు నేరస్థులను సులభంగా పట్టుకుంటాయని కమిషనర్ చెప్పారు. వాంటెడ్ క్రిమినల్‌ను ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలో బంధిస్తే, అది కెఐసిసిసి వద్ద విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది. వారు సంబంధిత పోలీస్ స్టేషనుకు తెలియజేస్తారు. దీంతో పోలీసులు వచ్చి నేరస్థుడిని అరెస్టు చేస్తారు.