ఫేస్‌బుక్ పెళ్లా... ఎక్కువ రోజులు ఉండదు.. విడాకులు తీసుకోండి : హైకోర్టు

శనివారం, 27 జనవరి 2018 (11:55 IST)
ఫేస్‌బుక్ ద్వారా పరిచయమై పెళ్లి చేసుకున్నారా? అయితే మీ కాపురం ఎక్కువ రోజులు కొనసాగదు. అందువల్ల మీరిద్దరూ విడాకులు తీసుకోండి అంటూ గుజరాత్ హైకోర్టు సూచన చేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌కు చెందిన ఫాన్సీ షా, జయదీప్‌ షాలు 2011లో ఫేస్‌బుక్‌ ద్వారా ఒకరికొకరు పరిచయమయ్యారు. ఆ తర్వాత వీరి పరిచయం ప్రేమగా మారడంతో రెండు కుటుంబాల పెద్దల అంగీకారంతో వీళ్లిద్దరూ 2015 ఫిబ్రవరి 8న పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన రెండు నెలలు కూడా కాకుండానే భర్త జయదీప్‌, అత్తమామలు తనను వేధిస్తున్నారంటూ ఫాన్సీ కేసు పెట్టింది.
 
గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌కు చెందిన ఫాన్సీ షా అనే యువతి తన భర్త జయదీప్‌ షా, అత్తమామలు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారంటూ   పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసు విచారణ బుధవారం జరిగింది. ఈ సందర్భంగా కోర్టు పై వ్యాఖ్యలు చేసింది. పెళ్లయిన రెండునెలలకే వారి దాంపత్య జీవితంలో తీవ్రస్థాయిలో విభేదాలు ఏర్పడ్డ విషయాన్ని కోర్టు ఈ సందర్భంగా తెలిపింది. ఫేస్‌బుక్‌ పరిచయం ద్వారా జరిగిన వివాహాల్లో ఇది కూడా ఒకటి కాబట్టి ఈ పెళ్లి విఫలం కాకతప్పదన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు