దివంగత ముఖ్యమంత్రి జయలలితకు ప్రేమ లేఖ రాసే అభిమానుల సంఖ్య అప్పట్లో చాలా ఎక్కువనే విషయం అందరికీ తెలిసిందే. హీరోయిన్‌గా జయలలిత ఓ ఊపులో ఉన్నప్పుడు జయలలితకు ఫ్యాన్స్ వెల్లువల్లా ప్రేమలేఖలు రాసేవారు. ఈ విషయాన్ని జయలలిత ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. సినిమా, రాజకీయ రంగాల్లో తనకంటూ ఓ స్థానాన్ని కైవసం చేసుకున్న జయలలితను చూస్తేనే.. ప్రభుత్వాధికారులైన పురుషులు జడుసుకునేవారు. కానీ ఆమెకు లవ్ లెటర్స్ రాసే వారూ ఉన్నారు.
వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నట్లు జయలలిత ఎన్నో సందర్భాల్లో స్వయంగా చెప్పారు. ఈ నేపథ్యంలో సినిమా రంగంలో ఉన్నప్పుడు ఓ ఫ్యాన్ తనకు ప్రేమ లేఖ రాశాడని చెప్పారు. ఆ ప్రేమలేఖలో జయను అతడు ప్రేమిస్తున్నట్లు రాశాడు. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పాడట. మీరు ఓకే చెప్పకపోతే.. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. డెడ్ లైన్ కూడా పెట్టాడు.. అంటూ జయమ్మ ఆ ఇంటర్వ్యూలో తెలిపారు.
ఈ లేఖకు జయలలిత సమాధానం ఇస్తూ లేఖ రాయనేలేదట. ఆపై డెడ్ లైన్ విధించిన తేదీ ముగిశాక.. అదే అభిమాని నుంచి మరో లేఖ అందిందట. అందులోనూ ఆ ఫ్యాన్ చనిపోతానని బెదిరించాడట. కానీ ఆపై జయలలిత ఆ లేఖకు సమాధానమిస్తూ ఓ లేఖ రాశారట. అందులో తనకు భర్తగా వచ్చే వ్యక్తి చెప్పిన మాటపై నిలబడాలని రాశారు. అయితే నువ్వు (ఫ్యాన్) ఇంతకుముందు పంపిన లేఖలో ఇచ్చిన డెడ్ లైన్ ప్రకారం నడుచుకోలేదు.