ప్రధాని కాన్వాయ్‌ను అడ్డుకున్నది మేమే : భారతీయ కిసాన్ యూయన్

గురువారం, 6 జనవరి 2022 (11:45 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం చేపట్టిన పంజాబ్ రాష్ట్ర పర్యటన అర్థాంతరంగా ముగిసింది. ప్రధాని ప్రయాణించే కాన్వాయ్‌‍ను పంజాబ్ రైతులు అడ్డుకున్నారు. దాదాపు 20 నిమిషాల పాటు ఆయన కాన్వాయ్ ఫ్లైఓవర్‌పైనే నిలిచిపోయింది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేరింది. ఈ వ్యవహారంపై పంజాబ్ ప్రభుత్వంపై కేంద్ర హోం శాఖ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సవివర నివేదికను కోరింది. 
 
అయితే, ఈ ఘటనకు తామే కారణమని భారతీయ కిసాన్ యూనియన్ ప్రకటించుకుంది. ప్రధానికి నిరసనను తెలిపేందుకు  పియారియానా గ్రామ సమీపంలోని ఫ్లైఓవర్ వద్దకు వచ్చామని తెలిపింది. ఏడు రైతు సంఘాలు డిసెంబరు 31వ తేదీన సమావేశమై ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా భారీ నిరసన తెలపాలని ఆ సమావేశంలో నిర్ణయించడం జరిగిందని చెప్పింది. 
 
మరోవైపు, ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా ఎలాంటి భద్రతా వైఫల్యం లేదని పంజాబ్ ప్రభుత్వం తేల్చి చెప్పింది. దాదాపు పదివేల మంది పోలీస్ సిబ్బందిని బందోబస్తుగా నియమించామని ఆ రాష్ట్ర డీజీపీ పేర్కొన్నారు. పైగా, సభావేదిక ప్రాంగణం మొత్తం ప్రత్యేక దళ పోలీస్ బృందాలో ఉన్నదని గుర్తుచేసింది. అయితే, సభకు తగిన మంది ప్రజలు రాలేదని, పైగా, ప్రధాని చివరి నిమిషంలో రోడ్డు మార్గంలో ప్రయాణించారని వివరణ ఇచ్చింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు