రైతుల 'రైల్ రోకో'.. నాలుగు గంటలు.. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు

గురువారం, 18 ఫిబ్రవరి 2021 (11:20 IST)
దేశవ్యాప్తంగా రైతుల 'రైల్ రోకో' కార్యక్రమం గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు జరగనుంది. మూడు నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా రైల్ రోకో కార్యక్రమం జరపనున్నారు రైతులు. దాంతో మధ్యాహ్నం 12 గంటల నుంచి నాలుగు గంటల వరకు 'రైల్ రోకో' నిర్వహించాలంటూ 'సంయుక్త కిసాన్ మోర్చా' పిలుపునిచ్చింది. 
 
అయితే శాంతియుతంగా నిరసన తెలపాలని 'సంయుక్త కిసాన్ మోర్చా' తెలిపింది. ఏలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రైల్వే పరిరక్షణ దళంతో భారీ సెక్యూరిటీ ఏర్పాటుచేసింది రైల్వే శాఖ. దేశవ్యాప్తంగా 20 వేలకు మందికి పైగా రైల్వే పరిరక్షక దళాలను మొహరించారు. పంజాబ్, హర్యానా, పశ్చిమబెంగాల్, రాష్ట్రాల పై ప్రత్యేక దృష్టి సారించారు. పరిస్థితులను ఎప్పటికకప్పుడు సమీక్షించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది రైల్వే శాఖ.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు