జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఒమర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌పై కేంద్ర మంత్రులు విమర్శలు గుప్పిస్తూ, రెచ్చగొట్టడం వల్లే... వాళ్లు నగ్రోటా పట్టణంపై దాడి చేసి, ఏడుగురు సైనికులను హతమార్చారన్నారు. ఈ ఉగ్రదాడికి కేంద్రమంత్రులే కారణమని అన్నారు.
జమ్మూకాశ్మీర్‌లోని టెర్రరిస్టులు తలచుకుంటే ఏమైనా చేయగలుగుతారని, భారత సైన్యమంతా కలిసినా వారిని అడ్డుకోలేరని సీనియర్, మాజీ సీఎం ఫరూక్ అబ్ధుల్లా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీరును ఆ దేశానికి వదిలేయాలంటూ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఫరూక్ మరోసారి తన కామెంట్స్‌తో వేడి పుట్టించారు.