వైన్‌షాపుకు ఐదేళ్ల కుమారుడితో వెళ్లిన తండ్రి..

శుక్రవారం, 4 జనవరి 2019 (11:53 IST)
అవును.. మందేసేందుకు ఐదేళ్ల కుమారుడిని వెంటబెట్టుకుని వెళ్లాడు ఓ తండ్రి. అయితే ఫూటుగా తాగేసిన ఆ దుర్మార్గుడు కన్నబిడ్డను మరిచిపోయాడు. తాగి రోడ్డుపైనే పడిపోయాడు. చివరికి ఆ బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఈ ఘటన చెన్నైకి సమీపంలోని ఓరగడంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కాంచీపురం జిల్లా, ఓరగడం సమీపంలోని సేందమంగళం ప్రాంతానికి చెందిన కుమార ప్రసాద్ తన ఐదేళ్ల కుమారుడితో టాస్క్ మార్క్ షాపుకు వెళ్లాడు. ఐదేళ్ల కుమారుడిని పక్కనే కూర్చోబెట్టుకుని.. మద్యం తాగాడు. ఫుల్‌గా తాగడంతో తలతిరిగి రోడ్డుపై పడ్డాడు. చివరికి కుమారప్రసాద్ ఐదేళ్ల కుమారుడిని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. 
 
ఇంతలో కుమార ప్రసాద్‌ని వెతుక్కుంటూ ఆతడి భార్య రోడ్డుపైకి వచ్చింది. కానీ భర్త రోడ్డుపై పడివుండటాన్ని గమనించింది. ఇంకా పిల్లాడు కిడ్నాప్ అయ్యాడని తెలుసుకుని బోరున విలపిస్తూ.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు