2010లో నిత్యానంద-రంజితలు కలిసి పడకగదిలో ఉన్న వీడియో క్లిప్పింగ్స్‌ను ప్రముఖ తమిళ టీవీ ఛానల్ ప్రసారం చేసి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిపై బెంగుళూరు, చెన్నైలలో కేసులు జరుగుతున్నాయి. దీనిపై నిత్యానంద, రంజితలు గతంలో మాట్లాడుతూ.. ఆ వీడియో టేపులు నిజమైనవి కావన్నారు. సన్‌టీవీ, నక్కీరన్ అధిపతులు ఆ టేపులు చూపి తమని బ్లాక్మెయిల్ చేశారని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో వీడియో బయటపడటంతో నిత్యానంద ఆధ్యాత్మిక ముసుగులో భక్తులను మోసం చేశారంటూ కేసు నడిచింది. అయితే తనలో లైంగిక పటుత్వం లేదని, ఆ వీడియోలో ఉన్నది తాను కాదని స్వామి నిత్యానంద వాదించడంతో పాటు ప్రకటన కూడా చేశారు.