Rishabh Shetty: కాంతారాచాప్టర్1 దివ్య గాథ బాక్సాఫీస్‌ను కైవసం చేసుకుంది

చిత్రాసేన్

శుక్రవారం, 17 అక్టోబరు 2025 (18:01 IST)
Kantara-1 recored poster
కాంతారాచాప్టర్1 ప్రపంచవ్యాప్తంగా 717.50 CRORES+ GBOCని దాటింది, ఇందులో కేవలం 2 వారాల్లోనే తెలుగు రాష్ట్రాల నుండి 105 కోట్లకు పైగా రికార్డ్ క్రియేట్ చేసింది. రిషబ్ శెట్టి బిగ్గెస్ట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్  కాంతార: చాప్టర్ 1. ప్రఖ్యాత పాన్-ఇండియా నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదలైన అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని ఘన విజయాన్ని అందుకుంది. తొలి వారంలో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 509 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి కొత్త బెంచ్ మార్క్ ని క్రియేట్ చేసింది.
 
ఈ దీపావళికి సినిమాల్లో బ్లాక్‌బర్ గా నిలవడంతో తమ ఆనందాన్ని రిషబ్ శెట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. నేడు సోషల్ మీడియాలో తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. కన్నడలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఓ సంఘటనకు కల్పిత కథగా రిషబ్ తీర్చిదిద్దాడు. అనూహ్య విజయంతో దేశం మొత్తం మంచి టాక్ తెచ్చుకుంది. కథని చాలా నిజాయితీగా చెప్పాలనుకున్నాం. అది ప్రేక్షకులకు నచ్చింది. ఇండియా జానపద కథలకు నిలయం. ఈ సినిమా విజయం మరిన్ని జానపద కథలు రావడానికి అవకాశం కల్పించడం చాలా ఆనందంగా ఉంది అని తెలిపారు. హోంబలేఫిల్మ్స్, ప్రగతిఆర్‌షెట్టి నిర్మాతలు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు