దేశాన్ని ఓ కుదుపు కుదిపిన పశుగ్రాసం కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ దోషిగా తేలారు. ఈ మేరకు రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు శనివారం తీర్పునిచ్చింది. అలాగే, మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రాతో పాటు ఏడుగురిని నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది.
దీంతో లాలూ సహా మొత్తం 38 మందిపై సీబీఐ 1997, అక్టోబర్ 27న చార్జిషీట్ దాఖలుచేసింది. ఈ కేసు విచారణ జరుగుతున్న కాలంలో 11 మంది చనిపోగా, ముగ్గురు అప్రూవర్లుగా మారిపోయారు. మిగిలిన వారంతా శనివారం కోర్టుకు హాజరయ్యారు.