శశికళ భర్తకు జైలుశిక్ష... లగ్జరీ కారు దిగుమతి కేసులో...

శుక్రవారం, 17 నవంబరు 2017 (15:24 IST)
అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆమె భర్త ఎం నటరాజన్‌కు రెండేళ్ళ జైలుశిక్షను ఖరారు చేస్తూ మద్రాసు హైకోర్టు శుక్రవారం తీర్పును వెలువరించింది. రూ.1.62 కోట్ల విలువ చేసే లగ్జరీ కారును విదేశాల నుంచి 2009లో నటరాజన్ దిగుమతి చేసుకున్నారు. దీనికి పన్ను చెల్లించక పోవడంతో సీబీఐ కేసు నమోదు చేయగా, కేసు విచారణ కూడా సీబీఐ కోర్టులో జరిగింది. 
 
ఈ విచారణ అనంతరం 2010లో సీబీఐ కోర్టు నటరాజన్‌తో పాటు.. నలుగురిని దోషులుగా నిర్ధారించి, రెండేళ్లు జైలుశిక్షను విధించింది. దీంతో ఆ నలుగురు సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో అప్పీల్ చేయగా, కిందికోర్టు ఇచ్చిన తీర్పును మద్రాసు హైకోర్టు ఖరారు చేసింది. కాగా, ఈ కేసులో అక్రమాస్తుల కేసులో మూడేళ్ళ జైలు శిక్ష పడిన శశికళ బంధువు భాస్కరన్ కూడా ఉండటం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు