బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలోని పితౌంఝియా (ప్రస్తుతం కర్పూరి గ్రామ్) గ్రామంలో జన్మించిన ఠాకూర్ తన విద్యార్థి ప్రాయంలో జాతీయ భావాలతో తీవ్రంగా ప్రభావితమయ్యారు. ఇంకా విద్యార్థి కార్యకర్తగా క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నందుకు 26 నెలల జైలు జీవితం గడిపారు. స్వాతంత్ర్యం తర్వాత, ఠాకూర్ రాజకీయాల్లోకి రాకముందు ఉపాధ్యాయుడిగా పనిచేశారు.
రాజకీయ వ్యక్తిగా, ఠాకూర్ వివిధ సామాజిక , రాజకీయ కార్యక్రమాలలో కీలక పాత్ర పోషించారు. అతను అణగారిన వర్గాల కోసం పాటుపడ్డారు. భూసంస్కరణల కోసం కృషి చేశారు. ఠాకూర్ మంత్రిగా, ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు.