వివరాల్లోకి వెళితే... మహరాష్ట్రలోని పూణెకి చెందిన యువతి గోవాకు చెందిన యువకుడిని పెళ్లాడింది. వారిద్దరూ రెండేళ్లపాయు హాయిగా వున్నారు. కానీ ఈ ఏడాది ప్రారంభంలో ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె కొన్ని రోజుల తర్వాత పుణెలోనే ఓ యువకుడిని వివాహం చేసుకుంది. ఇది చూసిన మాజీ భర్త ఓర్వలేకపోయాడు. ఆమెను పెళ్లాడినప్పుడు పడకగదిలో గడిపిన దృశ్యాలను నెట్లో పెట్టేశాడు.