మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న పురస్కారం

శుక్రవారం, 25 జనవరి 2019 (21:36 IST)
సీనియర్ నాయకులు, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని భారత రత్న పురస్కారం వరించింది. కొద్దిసేపటి క్రితం కేంద్ర ప్రభుత్వం ఈమేరకు ప్రకటన చేసింది. ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న పురస్కారం దక్కడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేస్తూ దేశానికి అమూల్యమైన సేవలను అందించిన నాయకులని కొనియాడారు.
 
కాగా భారతరత్న పురస్కారం ప్రణబ్ ముఖర్జీతో పాటుగా నానాజీ దేశ్‌ముఖ్, భూపేన్ హజారికాలకు మరణానంతరం ఈ పురస్కారాలకు ఎంపిక చేసినట్లు కేంద్రం ప్రకటించిందని ఏఎన్ఐ వార్తా వెల్లడించింది. జనవరి 26 సందర్భంగా భారత ప్రభుత్వం వీరికి భారతరత్న ఇవ్వాలని నిర్ణయించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు