వైద్యురాలిపై సామూహిక అత్యాచారం: షేర్ ఆటోను మళ్లించి?

మంగళవారం, 22 మార్చి 2022 (14:39 IST)
వైద్యురాలిపై సామూహిక అత్యాచారం చోటుచేసుకుంది. ఈ ఘటన వేలూరులో చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఓ యువతి డాక్టర్‌గా పనిచేస్తున్నారు. 
 
మూడు రోజుల క్రితం తన స్నేహితులతో కలిసి  కాట్పాడిలోని సినిమా థియేటర్‌లో సెకెండ్‌షోకు వెళ్లారు. అనంతరం స్నేహితులతో కలిసి వేలూరుకు షేర్‌ ఆటోలో బయలు దేరింది.
 
ఆ ఆటోలో అప్పటికే నలుగురు వ్యక్తులున్నారు. వారంతా కలసి ఆటోను సత్‌వచ్చారిలోని మరో రోడ్డుకు మళ్లించారు. యువతి డ్రైవర్‌ను నిలదీయగా సమాధానం ఇవ్వకుండా ఆటోను పాలారు నది ఒడ్డుకు తీసుకెళ్లారు. 
 
యువతి స్నేహితునిపై దాడి చేసి అక్కడ నుంచి బెదిరించి తరిమి వేశారు. అనంతరం నలుగురు వ్యక్తులు కలిసి ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు