నిర్భయ దోషులకు ఉరిశిక్షలను అమలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని మీరట్ జైలు తలారీని సంబంధింత జైలు శాఖ అధికారురులు కోరారు. వాస్తవానికి ఈ నలుగురు దోషులను ఉరితీసేందుకు ఇద్దరు తలారీలను తీహార్ జైలు అధికారులు కోరారు. ఈ మేరకు వారు ఉత్తరప్రదేశ్ జైళ్ళ శాఖ అధికారులకు లేఖ రాసినట్టు యూపీ జైళ్లశాఖ అదనపు డీజీ ఆనంద్‌కుమార్ వెల్లడించారు.
'మీరట్ జైలు అధికారులు అడిగితే నిర్భయ కేసులో దోషులను ఉరితీసేందుకు నేను సిద్ధం. ఇప్పటికైతే నాకు ఎటువంటి ఆదేశాలు రాలేదు. కానీ ఆదేశించిన 24 గంటల్లోపు విధులు నిర్వర్తించేందుకు నేను సిద్ధం. నా తాత కల్లు, తండ్రి బబ్బు కూడా తలారీలుగా పనిచేశారు. ఐదుగురిని ఉరి తీయడంలో నా తాతకు నేను సాయం చేశా.