ఈ విధానంలో భాగంగా, దేశంలో 18 ఏళ్లు నిండిన అందరికీ కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా కరోనా వ్యాక్సిన్లు వేయనుంది. 75 శాతం వ్యాక్సిన్లను తయారీదారుల నుంచి కొనుగోలుచేసి ప్రతి ఒక్కరికీ ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రధాని వెల్లడించారు. ఇక నుంచి ఏ రాష్ట్ర ప్రభుత్వమూ వ్యాక్సిన్ల కోసం ఖర్చు పెట్టాల్సిన అవసంర లేదు. ఇప్పటివరకూ కేవలం 45 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే కేంద్రం ఉచితంగా వ్యాక్సిన్లు ఇచ్చేది.
18 నుంచి 44 ఏళ్ల మధ్య వారు వ్యాక్సిన్‌కు డబ్బు చెల్లించాల్సిందేనని చెప్పగా.. తెలంగాణ సహా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల ఆ ఖర్చు తాము భరిస్తామని ప్రకటించాయి. ఈ వ్యాక్సిన్ విధానంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతోపాటు సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడంతో మోడీ సర్కార్ దిగి వచ్చి అందరికీ ఫ్రీ వ్యాక్సిన్ ప్రకటన చేసింది.