ఉచితాలకు అయ్యే ఖర్చును, అందుకు అవసరమయ్యే నిధులను ఎక్కడి నుంచి తెస్తారన్న విషయాలను కూడా రాజకీయ పార్టీలు ప్రజలు వివరించాలని ఈసీ స్పష్టం చేసింది. తద్వారా ఉచితాలకు ఆయా పార్టీలు నెరవేర్చగలవా లేదా అనే అంశంపై ఓటర్లకు ఓ అభిప్రాయం ఏర్పడుతుందని పేర్కొంది.
ఈ క్రమంలో, రాజకీయ పార్టీలే తాము ఫలానా థకం ఏ కారణంతో ఇస్తున్నారో వాటికి నిధులు ఎక్కడన నుంచి తీసుకువస్తారో కూడా చెప్పాలని ఎన్నికల సంఘం కోరింది. కాగా, ఇలాంటి హామీలు ఇవ్వకుండా రాజకీయ పార్టీలను అడ్డుకోలేమని, అందుకే ఆయా ఉచితాలకు సంబంధించిన వివరాలను తెలుసుకోవడం తమ హక్కుగా ఓటర్లను భావించాలని సూచించింది.