ఈ వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం దేశంలోనే అత్యుత్తమంగా అభివృద్ధి చెంది లెక్కనేంత మంది వైద్య నిపుణులను దేశానికి అందించిందని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో వైద్య అధ్యయనాలు మెరుగుదలకు ఆయన చేసిన కృషిని స్మరించుకునేందుకు ఈ విశ్వవిద్యాలయానికి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అని పేరు పెట్టారని గుర్తుచేశారు.
ఆ తర్వాత రాష్ట్రంలో ఏ రాజకీయా పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ గత 25 యేళ్లకు పైగా ఉనికిలో ఉన్న ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం పేరు మార్చలేదన్నారు. కానీ, ఇపుడు ఏవో రాజకీయ స్వలాభాల కోసం అనేక మంది భావోద్వేగాలతో ముడిపడివున్న ఈ అంశాన్ని వాడుకోవడం తప్పు అని ఆయన అన్నారు.