భారతీయ డిజిటల్ విప్లవంతో ఉపాధి అవకాశాలలో లింగ సమానత్వం మెరుగు: ఇండియా స్కిల్స్ నివేదిక 2021
గురువారం, 18 ఫిబ్రవరి 2021 (22:17 IST)
కోవిడ్ అనంతర కాలంలో భారతదేశంలో ప్రతిభావంతులకు డిమాండ్ మరియు సరఫరా అనే అంశంపై యుఎన్‌డీపీ, ఏఐయు, ఏఐసీటీఈ, సీఐఐ, టాగ్డ్‌తో భాగస్వామ్యం చేసుకుని ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2021ను వీబాక్స్ విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం దేశంలో ఉద్యోగార్హత కలిగన ప్రతిభావంతులు ఢిల్లీ-ఎన్‌సీఆర్, ఒడిషా, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్నారు. అంతేకాదు, దేశంలో 45.9% మంది యువత అత్యున్నత ఉద్యోగార్హతలు కలిగి ఉన్నారు. అలాగే ముంబైలో ఏకంగా 70% మంది అత్యధిక ఉద్యోగార్హతలను కలిగి ఉంటే, దీనిని అనుసరించి హైదరాబాద్‌లోనే ప్రతిభావంతులున్నారని ఆ నివేదిక వెల్లడించింది.
దేశవ్యాప్తంగా వీబాక్స్ నేషనల్ ఎంప్లాయబిలిటీ టెస్ట్ (డబ్ల్యునెట్)కు హాజరవుతున్న ఫైనల్ ఇయర్ విద్యార్ధులతో పాటుగా ఇండియా హైరింగ్ ఇంటెంట్ సర్వేలో పాల్గొన్న 15 రకాల పరిశ్రమలలోని 150కు పైగా కార్పోరేట్స్‌ను పరిశీలించిన తరువాత ఇండియా స్కిల్స్ నివేదిక విడుదల చేశారు.
భారతదేశంలో అత్యధికంగా బ్యాంకింగ్, ఆర్ధిక రంగంలో ఉపాధి కల్పన జరుగుతుంటే అనుసరించి ఐటీ, ఐటీ ఆధారిత సేవలతో పాటుగా ఆరోగ్య, ఆటోమోటివ్, వాణిజ్య విభాగం, లాజిస్టిక్స్, విద్యుత్ రంగాలు ఉంటున్నాయి. ఉద్యోగ మార్కెట్‌లో ఢిల్లీ-ఎన్‌సీఆర్, కర్నాటక, మహారాష్ట్రలు ఆధిపత్యం చూపుతున్నాయి.
వీబాక్స్ ఫౌండర్ అండ్ సీఈవో నిర్మల్ సింగ్ మాట్లాడుతూ, భారతీయ డిజిటల్ విప్లవంలో ఉద్యోగార్హత పరంగా లింగ సమానత్వం వృద్ధి చెందుతుంది. ఒక నిర్మాణాత్మక మార్పు ఏమిటంటే, గత ఐదు సంవత్సరాలతో పోలిస్తే మహిళల భాగస్వామ్యం గణనీయంగా వృద్ధి చెందింది. మొత్తం శ్రామికశక్తిలో 36% మంది మహిళలు ఉంటున్నారు. బ్యాంకింగ్ ఆర్థిక సేవల రంగంలో అత్యధికంగా 46% మంది మహిళలు ఉన్నారు అని అన్నారు.
ఇదే సమయంలో ఈ నివేదిక ద్వారా 2021లో అత్యధిక డిమాండ్ కలిగిన కోర్సులను గురించి కూడా వెల్లడించారు. బీటెక్, ఎంబీఏ చదివిన వారిలో 47% మంది ఉద్యోగార్హత నైపుణ్యాలు కలిగి ఉంటే అనుసరించి బీకామ్, బీఏ, బీఫార్మా అభ్యర్థులు నిలిచారు.
ఈ అధ్యయనం వెల్లడించిన దాని ప్రకారం యువతలో ఉద్యోగార్హత అనేది 45.9%గా ఉంది. గత సంవత్సరం అది 46.2%గా ఉంది. ఇక ఈ సంవత్సరం సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ కోర్సులు చేసిన వారి విషయంలో డిమాండ్ వృద్ధి చెందుతుంది. దీనిని అనుసరించి ట్రావెల్, టూరిజం, విద్యుత్, తయారీ రంగాలలో డిమాండ్ అధికమయ్యే అవకాశాలున్నాయి. దీనితో వరుసగా రెండవ సంవత్సరం కూడా విద్యార్థులకు ఉపాధి అవకాశాలు తగ్గడానికి కారణమయ్యే అవకాశాలున్నాయని ఈ నివేదిక అభిప్రాయపడింది.