అక్క మొగుడు అత్యాచారం చేశాడు.. బిడ్డకు జన్మనిచ్చిన బాలిక.. ఉరేసుకుని ఆత్మహత్య..

శుక్రవారం, 11 ఆగస్టు 2017 (17:47 IST)
అక్క మొగుడు చేసిన అఘాయిత్యానికి ఓ మరదలు నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్న నేపథ్యంలో.. అక్క మొగుడు అత్యాచారానికి పాల్పడిన కారణంగా ఓ మరదలు గర్భం దాల్చింది. అంతేగాకుండా కడుపులోని బిడ్డకు జన్మనిచ్చి.. బాధితురాలు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాధితురాలు 16 ఏళ్ల బాలికే కావడంతో అవమానాన్ని భరించలేక బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన తమిళనాడులోని మదురైలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. మదురైకి సమీపంలోని 16 ఏళ్ల బాలిక ఆమె అక్క భర్త చేతిలో నలిగిపోయింది. అత్యాచారానికి గురైంది. గర్భం ధరించింది. ఆ బిడ్డకు జన్మనిచ్చాక.. గురువారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మదురై, రాజక్కూర్, పెరియార్ నగర్‌కు చెందిన బాలికపై ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె అక్క భర్త లక్ష్మణన్ (26) అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని అక్కకు చెప్పకుండా ఆ బాలిక దాచేసింది. అక్క జీవితం కోసం దాచినా.. గర్భం ధరించడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. దీనిపై లక్ష్మణన్‌పై కేసు నమోదైంది. అతనిని అరెస్టు చేసిన పోలీసులు జైలుకు తరలించారు.
 
ఈ నేపథ్యంలో కొన్ని నెలల క్రితం ఆమె గర్భం దాల్చింది. దీంతో మానసికంగా, శారీరకంగా ఒత్తిడికి లోనైన బాలిక ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో బాలిక తల్లిదండ్రులు, సోదరి షాక్ అయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి