కాగా, మనోహర్ పారీకర్ రక్షణ మంత్రిగా ఉన్న సమయంలో పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రతండాలపై భారత వాయుసేన మెరుపుదాడులు నిర్వహించింది. ఈ సర్జికల్ స్ట్రైక్స్ పూర్తిగా వ్యూహరచన చేసింది ఆయనే కావడం గమనార్హం. ఎంతో సౌమ్యుడిగా పేరున్న పారికర్ ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కంటే గతంలో భారత రక్షణ మంత్రిగా వ్యవహరించినప్పుడే ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది.
యూరీ సైనిక స్థావరంపై తీవ్రవాదులు దాడి తర్వాత భారత ఆర్మీకి పారికర్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. దాని ఫలితమే పీఓకేలో భారత బలగాలు ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేసి, విజయవంతంగా తిరిగొచ్చాయి. ఆ సర్జికల్ దాడుల తర్వాత భారత్ పేరు, పారికర్ పేరు అంతర్జాతీయంగా మార్మోగిపోయాయి.
పొరుగుదేశంలో ఉన్న ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం చేసేందుకు ఎక్కువగా శ్రమ తీసుకోకుండా ఖచ్చితమైన లక్ష్యాలు నిర్దేశించుకుని పనిముగించింది. ఈ దాడులు మనోహర్ పారికర్ రక్షణమంత్రిగా ఉన్న సమయంలో జరగడంతో ఆయన దూకుడుకు మంచి గుర్తింపే లభించింది. ఈ విషయంలోనే కాదు, భారత సైన్యానికి అత్యాధునిక రాఫెల్ విమానాలు కొనుగోలు చేసి భారత వాయుసేనను శత్రు దుర్భేద్యం చేయాలన్న ఆలోచన కూడా పారికర్ హయాంలోనే మొదలైంది.