Goods train hits ambulance: అంబులెన్స్‌ను ఢీకొన్న గూడ్స్ రైలు.. ఎవరికి ఏమైంది..?

సెల్వి

మంగళవారం, 11 మార్చి 2025 (15:08 IST)
Goods Rail
ఒడిశ్శా రాయగడ జిల్లాలో రైల్వే లైన్ దాటుతున్నప్పుడు గూడ్స్ రైలు అంబులెన్స్‌ను ఢీకొట్టడంతో పది మంది తృటిలో తప్పించుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కళ్యాణ్‌సింగ్‌పూర్ బ్లాక్‌లోని షికార్‌పాయ్, భలుమాస్కా రైల్వే స్టేషన్ల మధ్య అంబులెన్స్  పట్టాలు దాటుతుండగా ఈ సంఘటన జరిగింది. అయితే అప్పటికే రైలు రావడంతో.. ఆంబులెన్సును ఢీకొట్టడం జరిగిపోయింది. 
 
రైలు గంటకు 60-65 కి.మీ వేగంతో కదులుతుండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. రైలు నెమ్మదిగా నడపడం వల్ల అంబులెన్స్‌కు నష్టం తగ్గింది. దీంతో వంద మీటర్ల వరకు ఆంబులెన్సును లాక్కెళ్లిందని రైల్వే సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఒక ప్రైవేట్ కంటి ఆసుపత్రికి చెందిన అంబులెన్స్, షికార్పాయ్ పంచాయతీలోని అనేక గ్రామాల నుండి శస్త్రచికిత్సల కోసం రోగులను తరలిస్తోంది. 
 
ప్రమాదం జరిగిన వెంటనే రాయగడ డివిజనల్ రైల్వే మేనేజర్ అమితాబ్ సింఘాల్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. సరైన భూగర్భ మార్గం అందుబాటులో ఉంది. కానీ కొంతమంది స్థానికులు అనధికార క్రాసింగ్‌ను ఉపయోగిస్తున్నారు, దీని వల్ల ఈ దురదృష్టకర సంఘటన జరిగిందన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు