గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కి ఫేవరెట్ నటి ఉన్నారట. అంతేకాదు ఫేవరెట్ క్రికెటరూ ఉన్నాడట. ఇంతకీ ఎవరువాళ్లు అని ప్రశ్నిస్తే నవ్వుతూ ఆయన చెప్పిన సమాధానాలు. జనవరి 4న భారతదేశం వచ్చిన పిచాయ్ తను విద్యార్థిగా చదువుకున్న ఐఐటి ఖరగ్‌పూర్‌కి వెళ్లారు. అక్కడ ఆయన చదువుకున్న రోజులను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో సంభాషించారు.