మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం, ఛత్తీస్‌గఢ్‌లలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలోసోషల్ మీడియా ద్వారా తప్పుడు వార్తలు ప్రచారం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని సామాజిక మాధ్యమాలు వెల్లడించాయి. ఈ మేరకు సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనరు ఉమేష్ సిన్హా సారథ్యంలోని సంఘం గూగుల్, ఫేస్‌బుక్, ట్విటర్ల ప్రాంతీయ అధికారులతో సమావేశమయ్యారు.