భూ పరిశీలన ఉపగ్రహం (ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ - ఈఓఎస్-03) ఉప గ్రహాన్ని అనేక ప్రయోజనాలు పొందేలా ఇస్రో రూపొందించింది. దేశ భూభాగం, సరిహద్దులు, అడవులకు సంబంధించి స్పష్టమైన ఛాయా చిత్రాలను పంపేలా తయారు చేశారు. కుంభవృష్టి, తుఫాన్లు వంటి ప్రకృతి విపత్తులపై కూడా త్వరగా అప్రమత్తమయ్యేలా సమాచారం పొందే ఉద్దేశంతో రూపొందించారు.
మూడో దశ అయిన క్రయోజనిక్ దశలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఈ ప్రయోగం విఫలమైనట్టు ఇస్రో ఛైర్మన్ వెల్లడించారు. దీంతో అది నిర్దేశిత మార్గంలోకాకుండా మరోమార్గంలో వెళ్లిందని, ఫలితంగా ప్రయోగం విఫలమైందని ఇస్రో చైర్మన్ శివన్ వెల్లడించారు.