చికెన్ తిని 30 మంది విద్యార్థులు అస్వస్థత.. కారణం ఇదేనా?

మంగళవారం, 18 జులై 2023 (20:45 IST)
చికెన్ తిని దాదాపు 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన కర్ణాటకలోని యడవనహళ్లిలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. చామరాజనగర జిల్లాలోని గుండ్లుపేటె తాలూకాలోని యడవనహళ్లి గ్రామంలోని మొరార్జీ దేశాయ్ వసతి పాఠశాలలో చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆదివారం రాత్రి 30మందికి పైదా విద్యార్థులు చికెన్ ఫుడ్ తీసుకున్నారు. 
 
కొంతసేపటికే అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. తీవ్ర అస్వస్థతకు గురైన మరో 15మందిని చామరాజనగర జిల్లా ఆస్పత్రిలో చికిత్స కోసం తరలించారు. 
 
అపరిశుభ్రమైన వంట పాత్రలతో పాటు నాణ్యత లేని చికెన్ వండటం వల్లే ఇదంతా జరిగి వుంటుందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు