ఉత్తరప్రదేశ్‌తో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళలపై అరాచకాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మహిళల రక్షణార్థం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చర్యలు కరువైనాయి. యూపీలో మహిళలపై అకృత్యాలు చోటుచేసుకున్నా.. సీఎం ఆదిత్య యోగి ఎలాంటి చర్యలు తీసుకోని పరిస్థితి తాజాగా హర్యానాలో వేర్వేరు ఘటనల్లో ఇద్దరు అమ్మాయిలపై దుర్మార్గులు లైంగికదాడికి ఒడిగట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హర్యానా రాష్ట్రంలోని యమునానగర్ జిల్లాకు చెందిన యువతి(19)ని శనివారం ఓ బాలుడు(17) బలవంతంగా సమీపంలోని చేను వద్దకు తీసుకెళ్లి లైంగికదాడి జరిపాడు. ఘటనను గమనించిన మరో వ్యక్తి కూడా ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆపై బాలుడిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.