పెళ్లైన మూడో రోజే విడాకులు.. మూడు ముళ్ల బంధం అలా తెగిపోయింది..

సోమవారం, 13 సెప్టెంబరు 2021 (15:24 IST)
భార్యాభర్తల అనుబంధం రోజు రోజుకీ కనుమరుగవుతోంది. పెళ్లి అంటే నూరేళ్ల జీవితం. కానీ ఆధునిక యుగంలో చిన్న చిన్న కారణాలకే భార్యాభర్తలు విడాకులతో విడిపోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే హర్యానాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. పెళ్లైన మూడో రోజే గొడవపడి కోర్టు మెట్లెక్కిన జంటకు హర్యానాలోని గురుగ్రామ్ కోర్టు షాకిచ్చింది. గురుగ్రామ్ పట్టణంలో వివాహం జరిగింది. అయితే పెళ్లి అయిన రెండు రోజులు కలిసి ఉన్న వీరుమూడోరోజు విడిపోయారు. ఆ తర్వాత విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. 
 
వివాహం - విడాకులకు ఏడాది సమయం ఉండాలని నిబంధన ఉన్నప్పటికీ… హిందూ వివాహ చట్టం 13- బీ ప్రకారం సమాచారాన్ని తొలగించాలని వారు కోరగా కోర్టు విడాకులు మంజూరు చేసింది. దీంతో జంట మూడు ముళ్ల బంధానికి… ముడి తెగి పోయింది. ప్రస్తుతం కోర్టు ఇచ్చిన ఈ తీర్పు.. దేశ వ్యాప్తంగా చర్చ నీయాంశంగా మారింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు