అనుమానం పెనుభూతమై : భార్యను హత్య చేసి మృత‌దేహాన్ని ముక్క‌లుగా చేసి పడేసిన భర్త

ఆదివారం, 6 నవంబరు 2016 (11:38 IST)
అనుమానం పెనుభూతమైంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. భార్యను హత్య చేసి మృతహాన్ని ముక్కలు ముక్కలుగా పడేశాడు. ఈ దారుణం రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వార్ నగరంలో చోటుచేసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
అల్వార్‌ నగరానికి చెందిన యోగేష్‌ అనే వ్యక్తికి భార్య‌, ఓ కూతురు ఉంది. అయితే, కొంతకాలంగా త‌న‌ భార్య ఆర్తిపై అనుమానం పెంచుకున్న యోగేష్ కొన్ని రోజుల క్రితం ఆమెను దారుణంగా హ‌త‌మార్చాడు. 
 
ఆపై ఆమె మృత‌దేహాన్ని ముక్క‌లుగా చేసి వాటిని అల్వార్‌లోని ప‌లు ప్ర‌దేశాల్లో విడివిడిగా ప‌డేశాడు. త‌ద్వారా కేసు నుంచి త‌ప్పించుకోవాల‌ని యోచించాడు. అయితే, ఆర్తి కాలును గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు జ‌ర‌ుపగా వారికి పలు ప్రాంతాల్లో మిగిలిన శరీర భాగాలు లభించాయి. చివ‌రికి మృతదేహం ఎవ‌రిద‌నే విష‌యాన్ని గుర్తించిన పోలీసులు హర్యానాలోని హిస్సార్‌లో యోగేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.

వెబ్దునియా పై చదవండి