భారీ వర్షాలు.. పొంగి ప్రవహిస్తున్న నదులు.. తెలుగు రాష్ట్రాల్లోనూ..?
బుధవారం, 19 ఆగస్టు 2020 (10:23 IST)
దేశంలో ఉత్తరాది, దక్షిణాదిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాలతో పలు నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. గోదావరి, గంగా, చాగర, పంచగంగా నదులు ప్రమాదస్థాయిలో ప్రవహిస్తుండటంతో నదీ తీరప్రాంతాలు వరదనీటిలో మునిగాయి. వేలాది గ్రామాలు నీట మునగడంతో ప్రజలను సురక్షితప్రాంతాలకు తరలిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేవ్ రాష్ట్రాల్లో భారీవర్షాలు కురవడం వల్ల నదులు పొంగుతున్నందున కేంద్ర జల సంఘం హెచ్చరికలు జారీ చేసింది. కేంద్ర వాతావరణశాఖ హిమాచల్ ప్రదేశ్
river
రాష్ట్రానికి ఎల్లో హెచ్చరికను జారీ చేసింది. భారీవర్షాల వల్ల సట్లైజ్, రవి, బియాస్, ఘగ్గర్, యమునా, భగీరథ, అల్కానంద, గంగా, రాంగంగా, సర్దా, సర్జూ నదుల నీటిమట్టం పెరుగుతోంది.
ఇదిలా ఉంటే.. బుధవారం ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని విశాఖ వాతావరణ కేంద్రం పేర్కొంది. దీని ప్రభావం వల్ల కోస్తా తెలంగాణలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని... ఆంధ్రప్రదేశ్‌లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
అటు ఒరిస్సాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దీంతో గోదావరికి మళ్లీ ఇంట్లో పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి.